ఫామ్‌హౌస్‌లో ప్రకాష్‌ రాజ్‌ ఎంజాయ్ చేస్తున్నాడట...

గురువారం, 10 ఏప్రియల్ 2014 (11:39 IST)
WD
మనిషి ఎంత ఎత్తు ఎదిగినా ఒరిజినల్‌గా ఓ టేస్ట్‌ ఉంటుంది. దానికి బానిస అయిపోతాడు. అది మంచి అయితే చాలా మేలే చేస్తుంది. ప్రస్తుతం ప్రకాష్‌ రాజ్‌ పరిస్థితి కూడా అంతే. సినిమాల్లో బిజీబిజీగా ఉన్న ప్రకాష్‌ రాజ్, ఇప్పుడు స్వంత ఫామ్‌హౌస్‌లో చాలా సరదాగా గడిపేస్తున్నాడు. ఇప్పటివరకు చాలా బిజీగా ఉన్న తాను ఇకపై వీలుచిక్కినప్పుడల్లా ప్రకృతితో ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నానంటూ ట్వీట్‌ చేశాడు.

ఫామ్‌హౌస్‌లో వ్యవసాయం, చేపలు పట్టడం, తాటిముంజెలు తినడం... ఇంకా ఎన్నో కుర్రతనంలో చేసేవి ఇప్పుడు తీరుతున్నాయని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ప్రకృతి ఎంతో అందమైనది. మనకు ఎంతో అందాన్నిచ్చినా.. మన బిజీ లైఫ్‌లో వాటిని ఎక్కువగా ఎంజాయ్‌ చేయలేం.

దానికి ఓ టైం వచ్చినట్లు.. నాకూ ఎంజాయ్‌ చేయడానికి టైం వచ్చిందంటున్నాడు. అలా అని సినిమాలు మానేయడం లేదు. తాజాగా ఆయన రూపొందించిన ఆవకాయ్‌ బిర్యానీ వచ్చే నెలలో విడుదల కాబోతుంది.

వెబ్దునియా పై చదవండి