మహేష్ బాబు చేతుల మీదుగా బసంతి ట్రైలర్స్ రిలీజ్

సోమవారం, 3 ఫిబ్రవరి 2014 (14:05 IST)
FILE
బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతమ్‌ కథానాయకుడిగా, అలేషాబేక్‌ కథానాయికగా నటించిన 'బసంతి' చిత్రం థియేటర్‌ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. సినిమా షూటింగ్‌లో మహేష్‌బాబు చేతులమీదుగా విడుదల చేశారు. అనంతరం ఆయన స్పందిస్తూ... రాజా గౌతమ్‌ లుక్‌ పెర్‌ఫార్మెన్స్‌ చాలాబాగుంది. ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉందని పేర్కొన్నారు.

దర్శకుడు శ్రీనువైట్ల.... సాంకేతికంగా కొత్తగా ఉన్న ఈ ట్రైలర్‌ ప్రజలకు చేరువుతుందని వ్యాఖ్యానించారు. నటి సమంత మాట్లాడుతూ.. ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఈ చిత్రంలో క్రూరమైన పాత్రను పోషించి అందులో భాగమైనందుకు ఆనందంగా ఉందని తనికెళ్ళభరణి పేర్కొన్నారు. చైతన్య దంతులూరి నిర్మిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

వెబ్దునియా పై చదవండి