మహేష్ బాబు 'ట్విట్టర్' రికార్డ్ : 6లక్షలు దాటిన ఫాలోయర్స్!

బుధవారం, 7 ఆగస్టు 2013 (12:01 IST)
FILE
టాలీవుడ్ అగ్రహీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్టైల్‌ను సొంతం చేసుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. పొకిరి, అతడు, దూకుడు లాంటి చిత్రాలతో టాలీవుడ్ నెంబర్‌వన్ హీరో అయిపోయాడు. అయితే మహేష్ బాబుకు ఫ్యాన్య్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ముఖ్యంగా యువకులలో మంచి ఫాలోయింగ్ వుంది. దానితో ట్విట్టర్‌లో తనని చాలా మంది ఫాలోయర్స్ ఫాలో అవుతున్నారు.

నిన్న మహేష్ బాబు ట్విట్టర్ ఫాలోయర్స్ 6 లక్షలు దాటింది. మహేష్ బాబు ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో '1-నేనొక్కడినే' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు పుట్టిన రోజును ఈ శుక్రవారం జరుగనుంది. ఈ సందర్భంగా విడుదల చేయనున్న ఈ సినిమా టీసర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తోంది. కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి