రమాలత్‌తో నా వివాహం చట్టబద్ధమైంది కాదు: ప్రభుదేవా

WD
తా వలచినదే రంభ.. ఆ రంభకు దాసోహమైన పురుషుడు ఎంతటి సాహసానికైనా దిగుతాడనే దానికి ప్రభుదేవా మంచి ఉదాహరణ కానున్నాడు. తన మొదటి భార్య రమాలత్‌తో జరిగిన వివాహం చట్టబద్ధమైంది కాదని కోర్టులో నిరూపించేందుకు ఆధారాలతో సహా వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇదిలావుంటే రమాలత్ సైతం ప్రభుదేవా మూలంగా పుట్టిన సంతానం యొక్క జనన ధృవీకరణ పత్రాలు, భార్యాభర్తలిద్దరూ కలిసి దరఖాస్తు చేసి తెచ్చుకున్న రేషన్ కార్డు.. ఇత్యాది ఆధారాలతో కోర్టు ముందుకు వచ్చేందుకు సిద్ధపడుతున్నారు.

ప్రియురాలికోసం ఓ పెళ్లైన ప్రియుడు భర్తను తన భర్తే అని నిరూపించుకునేందుకు కోర్టుకెక్కిన ఓ భార్య చేస్తున్న యుద్ధంలో విజయం సాధిస్తాడో లేదో చూడాలి. ఈ కేసు ఈ నెల 23న విచారణకు రానుంది.

వెబ్దునియా పై చదవండి