రామ్ చరణ్ - వినాయక్ సినిమా చూస్తే అభిమానులు కేరింతలు కొడతారట

మంగళవారం, 7 ఫిబ్రవరి 2012 (18:05 IST)
WD
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, డైనమిక్ కమర్షియల్ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో సూర్యదేవర రాధాకృష్ణ సమర్పణలో డి.వి.వి దానయ్య నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 6న హైదరాబాదులో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ ఫిబ్రవరి 22 వరకూ జరుగుతుంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్‌కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మరో కథానాయిక ఎంపిక జరగాల్సి ఉంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... యూనివర్సల్ మీడియా సంస్థలో మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్ హీరోగా, వినాయక్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 6 నుంచి నిర్విరామంగా జరుగుతుంది. కనల్ కణ్ణణ్ దర్శకత్వంలో యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరుగుతుంది. ఈ నెల 22 వరకూ ఈ షూటింగ్ జరుగుతుంది.

పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సిద్ధ చేసిన ఆకుల శివ కథకు సూపర్ టేకింగ్ డైరెక్టర్ వినాయక్ తోడై రామ్ చరణ్ అభిమానుల్ని కేరింతలు కొట్టేలా ఈ చిత్రంలో రామ్ చరణ్‌ని చూపించబోతున్నారు. రామ్ చరణ్ పాత్ర తీరుతెన్నులు చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పటివరకూ రామ్ చరణ్ చేయని పాత్ర ఇది. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ మరోసారి తనదైన నటనను ప్రదర్శించనుంది. మరో హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది అన్నారు.

వెబ్దునియా పై చదవండి