రూమర్స్‌పై సీతమ్మ ఫైర్ ... అయ్యబాబోయ్ నేను షకీలా ఏంటి?

బుధవారం, 26 ఫిబ్రవరి 2014 (14:10 IST)
FILE
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి అంజలి ఇపుడు ఫైర్ అవుతోంది. నేను షకీలా ఏంటని ఆమె ప్రశ్నిస్తోంది. ఇటీవల హాట్ సెక్స్‌బాంబ్ షకీలా ఆత్మకథ పుస్తకం విడుదలైన విషయం తెలిసిందే. అయితే షకీలా ఆత్మకథ ఆధారంగా ఓ సినిమా తీయనున్నారని అందులో షకీలా పాత్రలో అంజలి నటించనుందని వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో అంజలి ఈ వార్తలపై స్పందించింది. నేను షకీలాలాగ నటించమేంటని ఆమె ఫైర్ అవుతోంది. నాపై వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఎవరో కావాల‌నే ఈ విధ‌మైన వార్తలు పుట్టించి ప్రచారం చేస్తున్నారని, ఇవన్ని వట్టి పుకార్లే అని ఆమె చెప్పింది. షకీలా ఆత్మకథ సినిమాగా తెరకెక్కితే అందులో నటించే హీరోయిన్‌కి ఫుల్ పబ్లిసిటీ రావడం మాత్రం ఖాయం. పబ్లిసిటీ కోసం పాకులాడే ఏ భామైనా ఇందులో నటించ్చొచ్చు.

వెబ్దునియా పై చదవండి