వీకెండ్‌ లవ్‌ అంటే...?

బుధవారం, 2 ఏప్రియల్ 2014 (22:01 IST)
ా|| శ్రీహరి ప్రధాన పాత్రలో ఆధిత్‌, సుప్రియ శైలజ జంటగా దృష్టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నవ నిర్మాత మధు తోట నిర్మిస్తున్న 'వీకెండ్‌ లవ్‌' చిత్రానికి సంబంధించి టోటల్‌గా షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. ఏప్రిల్‌ 9న ఈ చిత్రం ఆడియోను హైదరాబాద్‌లోని రాక్‌హైట్స్‌లో విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత మధు తోట మాట్లాడుతూ - ''కేరళలో చిత్రీకరించిన పాటతో టోటల్‌గా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. ఈనెల 9 ఈ చిత్రం ఆడియోను హైదరాబాద్‌లోని రాక్‌ హైట్స్‌లో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేశాం.

వీకెండ్‌ లవ్‌ అంటే కేవలం యూత్‌ మాత్రమే కాదు కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కని చిత్రం. శేఖర్‌చంద్ర చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. 'వీకెండ్‌ లవ్‌' మ్యూజికల్‌గా కూడా పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకు వుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి సమ్మర్‌లోనే చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

వెబ్దునియా పై చదవండి