వైఎస్సారే నిజమైన రాజకీయనాయకుడు: రాజా

FILE
రాజకీయనాయకుడంటే ఎలా ఉండాలనేది "సమర్థుడు" చిత్రంలో చూపించామని హీరో రాజా అన్నారు. ఇటీవలే దివంగతులైన వై.ఎస్. రాజశేఖర రెడ్డి అసలైన రాజకీయనాయకుడని ప్రశంసించారు. ప్రమాదంలో ఆయన మరణించడం దురదృష్టకరమని రాజా చెప్పారు.

తాజాగా తాను హీరోగా నటిస్తోన్న "సమర్థుడు" చిత్రాన్ని నాయకత్వ లక్షణాలను కూడిన కథతో రూపొందించినట్లు రాజా తెలిపారు. సంజన హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఈ నెల 18వ తేదీన విడుదల కానుందని చెప్పారు.
WD


సమర్థుడు గురించి గురువారం రాజా మాట్లాడుతూ.. ఈనాటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఈ చిత్రముంటుందని, చక్కని సందేశం కూడా ఇందులో ఉందన్నారు.

దర్శకుడు అర్జున్ రెడ్డి సందేశాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేశారని రాజా తెలిపారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ చిత్రంలో రాజకీయనాయకుడిగా నటించాడని, ఆయనకు వ్యతిరేకంగా తాను నటించానన్నారు.

వెబ్దునియా పై చదవండి