శరవేగంగా రవితేజ 'పవర్‌'

బుధవారం, 2 ఏప్రియల్ 2014 (22:29 IST)
WD
హీరో రవితేజ, హన్సిక జంటగా నటిస్తున్న 'పవర్‌' చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. షెడ్యూల్లో భాగంగా కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌ లోని పలుచోట్ల ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. తదుపరి షెడ్యూల్‌ ఇక్కడ నుంచి కొల్‌కత్తాకు మారనుంది.

ఈ నెల 6 నుంచి కొన్ని రోజులపాటు అక్కడే చిత్రీకరణ ఉంటుంది. కె.ఎస్‌. రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌గా రవి కన్పించనున్నాడు. కీలక పాత్రను హీరోయిన్‌ రెజీనా కేసాండ్రా పోషిస్తోంది. రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌‌పై రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి