సల్మాన్ ఖాన్: ప్రేమ వద్దూ దోమా వద్దు.. పెళ్లి అసలొద్దు బాబోయ్!!

మంగళవారం, 7 జనవరి 2014 (14:41 IST)
సల్మాన్ ఖాన్ తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, తనకు గర్ల్‌ఫ్రండ్ ఉండటంపై కూడా అనాసక్తిగా ఉందని స్పష్టం చేశాడు. ఐశ్వర్యారాయ్, సంగీత, సోమీ అలీ, కత్రినా లాంటి స్టార్ హీరోయిన్లతో ప్రేమాయణం నడిపిన ఈ 48ఏళ్ల బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్‌కు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అంటున్నాడు.

తనకు ప్రేమ, పెళ్లిపై ఆసక్తి లేదని తాజాగా సల్మాన్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం తాను ఒక్కడిగానే బాగున్నానని, ముప్పై ఏళ్ల నుంచి అలానే ఉంటున్నానని సల్మాన్ వివరించాడు. ఇలా ఉండటాన్నే తాను ఇష్టపడుతున్నట్లు ఓ ఆంగ్ల చానల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

తన పెళ్లి విషయంలో తాను ఎవరికీ వివరణ ఇచ్చుకోవటం కానీ, అబద్దాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. తన జీవితంలోకి రావాలనుకునే వారు రావచ్చు అని, కానీ వాళ్లు తన నుంచి ఏమీ ఆశించకూడదని తెలిపాడు. తానెప్పుడు మహిళలను గౌరవిస్తానని చెప్పాడు. దీనిని బట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా సల్మాన్ పెళ్లి చేసుకుంటాడన్న ఆలోచనను స్నేహితులు, అభిమానులు ఇక మరచిపోక తప్పదు.

వెబ్దునియా పై చదవండి