సుకుమార్, ఎన్టీఆర్ కాంబినేషన్ ఖరారుకి రీజన్ ఇదేనా?

సోమవారం, 5 ఆగస్టు 2013 (10:00 IST)
FILE
ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్లో ఓ సినిమా నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ వార్త వాస్తవం కానుంది. వీరి కాంబినేషన్లో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ప్రముఖ నిర్మాత బీవీయస్ఎన్ ప్రసాద్ ప్రకటించారు.

సుకుమార్ చెప్పిన కథ విన్న వెంటనే ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎన్టీఆర్ కు కథ నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నాడట. ప్రస్తుతం ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా', 'రభస' చిత్రాలలో నటిస్తుండగా ... మహేష్ తో సుకుమార్ '1' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వీరిద్దరి కమిట్‌మెంట్లు పూర్తయ్యాక ఈ సినిమా మొదలవుతుంది. ఇదిలావుంచితే, నిర్మాత బీవీయస్ఎన్ ప్రసాద్ తాజాగా 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించిన సంగతి.

వెబ్దునియా పై చదవండి