స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

WD
సినీ పరిశ్రమలో విశేష కృషికి గుర్తుగా ఇచ్చే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును 2009 సంవత్సరానికిగాను స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడికి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. తెలుగు సినీరంగంలో "మూవీ మొఘల్"గా కీర్తి గడించిన శతాధిక చిత్రాల నిర్మాత రామానాయుడు ఇప్పటివరకూ 12 భాషల్లో 100 చిత్రాలకు పైగా నిర్మించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకెక్కారు.

స్వర్గీయ ఎన్.టి. రామారావు హీరోగా "రాముడు - భీముడు" చిత్రంతో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టిన రామానాయుడు ఆ తర్వాత నుంచి వెనుదిరిగి చూడలేదు. తమ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా విభిన్న చిత్రాలను అందిస్తూనే ఉన్నారు.

డాక్టర్ రామానాయుడు ఎందరో హీరోలను, హీరోయిన్లను, దర్శకులను, టెక్నీషియన్లను వెండితెరకు పరిచయం చేశారు. సినీ కార్మికుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఆయన తను ఆర్జించిన సొమ్మునంతా స్టూడియోల నిర్మాణాలకు వెచ్చిస్తున్నారు. తనను ఆదరించి ఇంతవాడిని చేసిన సినీ పరిశ్రమ, ప్రజల ఆదరణను మరువలేననీ, అదేవిధంగా తన కృషిని గుర్తించి అవార్డును ప్రకటించిన ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి