7 నుంచి చెన్నయ్‌లో "దసవాణి" సంగీత ఉత్సవాలు

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లో దసవాణి సంగీత ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. కర్ణాటక సంగీతంలో సంగీత పితామహాగా పేరుగాంచిన శ్రీ పురంధర దసర పేరుమీద శ్రీ లలితకళా అకాడెమీ ఫౌండేషన్ సహకారంతో శ్రీ పార్థసారథి స్వామి సంగీత సభ ఈ సంగీత ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. చెన్నయ్‌లో ప్రతియేటా జరిగే సంగీత ఉత్సవాల్లో భాగంగా ఈనెల ఏడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు దీన్ని నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

కాగా, మ్యూజిక్ ఫెస్టివల్ దసవాణి - 2010 పేరుతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాన్ని కోయంబత్తూరులోని హర్షా గురుకుల విద్యాలయ స్వామీజీ శ్రీ శ్రీ దయానంద సరస్వతి ప్రారంభించనున్నారు. కాగా, ఈ ఫెస్టివల్‌లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్నడ అండ్ బెంగుళూరు, సౌత్ జోన్ కల్చరల్ తంజావూర్‌లు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

ఈ మ్యూజిక్ ఫెస్టివల్‌లో భాగంగా వ్యాస విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ హెచ్.ఆర్.నాగేంద్ర జాతీయ స్థాయిలో స్టాప్ డయాబెటీస్ మెలిట్స్ (ఎస్‌డిఎం)ను ప్రారంభించనున్నారు. స్థానిక మైలాపూర్‌లోని నంబరు 55, భీమసేన గార్డెన్ రోడ్డులో ఉన్న శ్రీ పార్థసారథి సభ, విద్యాభారతి హాలులో జరుగనుంది.

ఈ కార్యక్రమంలో విద్వాన్ విద్యా భూషణ్, ఆర్కే.పద్మనాభ, రాధా థాండవేవర్ (బెల్లూరు సిస్టర్స్), వాణి సతీష్ మనసి ప్రసాద్, స్మితా బల్లూర్ (ఉత్తర దక్షిణ్)లతో పాటు.. కర్ణాటక విద్వాన్ మైసూర్ సతీష్, విద్యాన్ బెంగుళూరు చెవుల రాజ్, దయానంద మోహితిలు కర్ణాటక కళాకారులు పాల్గొంటున్నారు.

వెబ్దునియా పై చదవండి