రాజ్యసభ సీటుపై కన్నేసిన బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్!

సోమవారం, 15 సెప్టెంబరు 2014 (10:08 IST)
బాలీవుడ్ అమీర్ ఖాన్ రాజ్యసభ సీటుపై కన్నేశాడు. ఇటీవల మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ హీరోయిన్ రేఖ వంటి వాళ్ళకి పిలిచి మరీ రాజ్యసభ సీటును గత యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన విషయం తెల్సిందే. తనకు కూడా రాజ్యసభ సీటు కావాలనీ ఈ విలక్షణ నటుడు తన మనస్సులోని మాటను వెల్లడించాడు. 
 
తనకు రాజ్యసభ సీటు ఇస్తే ఎంపీగా సేవలందించడానికి సిద్దమేననే సంకేతాలిచ్చాడు. రాజ్యసభకు ఎంపికకు అవకాశం వస్తే ఆలోచిస్తానని ఓ హిందీ చానెల్ కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ స్పష్టం చేశారు. మోడీ పాలన గురించి తన కంటే మీడియాకే ఎక్కువ తెలుసునని అమీర్‌ఖాన్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. 

వెబ్దునియా పై చదవండి