ఆకాష్‌కు అస్వస్థత... అపోలో ఆసుపత్రిలో చికిత్స

శనివారం, 28 ఫిబ్రవరి 2015 (12:46 IST)
ప్రముఖ కథానాయకుడు ఆకాష్‌ అస్వస్థతకు లోనయ్యారు. తక్షణం ఆయనను అపోలో ఆసుపత్రిలో చేర్పించి, సకాలంలో వైద్య సదుపాయం అందించడంతో ఆయన కుదుటపడ్డారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ఆకాష్‌ ప్రస్తుతం ఇంటివద్ద విశ్రాంతి తీసుకొంటున్నారు. అలసటకు, ఆందోళనకు గురి చేసే పనుల జోలికి వెళ్లకుండా వారంరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. 
 
ఈ నేపధ్యంలో ఫిబ్రవరి 27న విడుదల కావాల్సిన 'ఆనందం మళ్లీ మొదలైంది' విడుదలను వాయిదా వేసారు. జూలై 6న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 'ఆనందం మళ్లీ మొదలైంది' చిత్రం ఆకాష్‌ దర్శకత్వంలో, ఆయనే హీరోగా రూపొందడం తెలిసిందే!

వెబ్దునియా పై చదవండి