క్యారెక్టర్ ఆర్టిస్ట్ భువనేశ్వరి గుర్తుందా..? శంకర్ బాయ్స్, గుడుంబా శంకర్లో నటించిన పాము కళ్ల చిన్నది.. ఆ మధ్య ప్రాస్టిట్యూషన్ కేసుల్లో అరెస్టయ్యింది. ఇప్పుడు ఈమె గురించిన టాక్ ఎందుకొచ్చిందంటే.. తన స్వస్థలమైన అన్నూరులో భువనేశ్వరి తన విలువైన ఆస్తులను కోల్పోయింది.
ఇంకా తన ఆస్తులు కోల్పోయానని పోలీసులకు భువనేశ్వరి ఫిర్యాదు చేసిందట. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. రెండేళ్ల క్రితం అన్నూరులో తనకు గల థియేటర్, ఇళ్లును అమ్మాలని డిసైడ్ చేసిందట. ఈ క్రమంలో లోకల్ బిజినెస్మేన్ సుబ్రహ్మణియంను కలిసి అమ్మాలని డిసైడ్ అయ్యిందట.