పొట్టి దుస్తులు వేసుకున్నందుకు గానూ ఒక వ్యక్తి తనను చెంపదెబ్బ కొట్టడంతో షాక్ తిన్నానని, అయినా తాను కుంగిపోలేదని రియాలిటీ షో నటి గౌహర్ఖాన్ చెప్పింది. తన పట్ల క్రూరంగా వ్యవహరించిన వ్యక్తి ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉండి ఉంటాడని పేర్కొన్నారు. అతని తీరుకు తగిన శిక్ష పడాలని పేర్కొన్నారు.
ఈ క్లిష్టసమయంలో తనకు అండగా నిలిచిన కుటుంబసభ్యులు, బాలీవుడ్ నటులు, అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.