ఇప్పటికే, త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో సెకండ్ హీరోయిన్గా ఆమె నటిస్తోంది. దీంతో పాటు, ఆది హీరోగా 'పెళ్లైన కొత్తలో' ఫేం మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా హీరోయిన్గా ఎంపికైంది.
ఈ రెండు చిత్రాలతో పాటు తాజాగా, మంచు విష్ణు హీరోగా దేవా కట్ట దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది తమిళంలో సూపర్ హిట్టైన 'అరిమా నంబి'కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.