రచయిత కానున్న బిగ్ బీ.. పెళ్ళిళ్లపై పుస్తకం రాస్తారట.. ట్వీట్..!

సోమవారం, 30 మార్చి 2015 (16:27 IST)
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కొత్త అవతారం ఎత్తనున్నారు! విభిన్నమైన పాత్రలతో తనలోని నటుడిని ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్న 'బిగ్ బి' దృష్టి ఇప్పుడు రచనపై మళ్లినట్టుంది. త్వరలోనే ఆయనొక పుస్తకాన్ని రాయనున్నారట. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో తెలిపారు. 
 
ఇంకా అందులో.. వివాహం అనేది ఓ వ్యవస్థ అని, గోవాలో బెంగాలీ కుటుంబ వివాహం... ఇలాంటివి తనను ఆకట్టుకుంటాయని ట్విట్టర్‌లో తెలిపారు. పెళ్లిళ్లే ఇతివృత్తంతా తానో పుస్తకం రాయాల్సి వచ్చేట్టుందని ఆయన ట్వీట్ చేశారు. 
 
ఇటీవల అమితాబ్ క్రికెట్ వరల్డ్ కప్ లో కామెంటరీ చెప్పి, తనకు ఆ ఫీల్డ్ కొత్త అయినా, క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. ఇదే వరుసలో రైటర్ గానూ ఆయన మెప్పించడం ఖాయమని బాలీవుడ్ వర్గాల టాక్.

వెబ్దునియా పై చదవండి