బుల్లితెరపై యాంకర్‌గా రాణించి ఆ తర్వాత వెండితరపై మెరుపులు మెరిపించిన వాళ్లు తక్కువే ఉన్నారు. ఈ లైన్లో కలర్స్ స్వాతికి తర్వాత అనసూయ కూడా ఉంది. ఇప్పటి వరకు తెలుగులో ఒక్క కలర్స్ స్వాతి మాత్రమే ఒకప్పుడు స్టార్ యాంకర్‌గా వెలుగొంది, ప్రస్తుతం సినీ పరిశ్రమలో కూడా హీరోయిన్గా కూడా రాణిస్తోంది.
ఉదయభాను లాంటి టాప్ యాంకర్ కూడా హీరోయిన్గా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయితే, ప్రస్తుతం తెలుగు టెలివిజన్ రంగంలో స్టార్ యాంకర్‌గా గుర్తింపు పొందిన అనసూయకు మాత్రం హీరోయిన్ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే, నిర్మాతలకు దిమ్మ తిరిగిపోయే రీతిలో కోటి రూపాయల పారితోషకాన్ని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కోటి రూపాయలిస్తే తన టీవీ షోలన్నీ వదిలేసి మరీ హీరోయిన్గా నటిస్తానని అనుసూయ కాస్త పేరున్న నిర్మాతలకు చెబుతోందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్.