ఇదే తరహాలో ప్రస్తుతం మళ్లీ అంజలి అదృశ్యమైందని నెలరోజులగా షూటింగ్‌లకు డుమ్మా కొట్టిందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది. తమిళంలో జయం రవి హీరోగా నటిస్తున్న అప్పాటక్కర్లో సెట్స్‌పై ఉండగానే యువ హీరో విమల్‌కు జోడిగా అంజలి ఎంపికైంది. ఇక అంజలి కెరీర్ గాడిలో పడ్డట్టేనని అనుకునేలోపే మరోసారి వివాదం కొనితెచ్చుకుంది.
జయం రవి, విమల్ సినిమా షూటింగ్‌లకు అంజలి హాజరుకాకుండా అమెరికా ట్రిప్‌కు వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ తొలివారంలో వచ్చేస్తానని చెప్పి వెళ్లిన అంజలి ఇంతవరకు తిరిగి రాలేదట. మధ్యలో ఒకసారి ఫోన్లో సంప్రదిస్తే.. ఏప్రిల్ 20న వస్తానని చెప్పి.. ఆ మాటను కూడా నిలబెట్టుకోలేదట. దీంతో దర్శకనిర్మాతలు తలపట్టుకున్నారు.