తాము అందంగా ఉన్నప్పటికీ తమ అందాన్ని ద్విగుణీకృతం చేసే మేకప్ మేన్, స్టయిలిస్ట్ వుంటారనీ, కానీ తెలివితేటల్ని నేర్పడానికి మాత్రం ఎవరూ ఉండరనీ చెప్పింది. "మొదట్లో కొన్ని తప్పులు చేస్తాం. వెంటనే వాటి నుంచి పాఠాలు నేర్చుకుని, మళ్లీ ఆ తప్పులు చేయకుండా ప్లాన్ చేసుకునే తెలివితేటలు మనకు వుండాలి. అప్పుడే సక్సెస్ అవుతాం" అంటోంది శృతి.