బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి తంతా అనే డైలాగు బాగా గుర్తుండే వుంటుంది. ఆ చిత్రం అనుకున్న రేంజ్ లో ఆడకపోవడం... ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా ఫ్లాప్‌లతో సాగుతుండటంతో ఎన్టీఆర్ కు అర్జెంటుగా ఓ కమర్షియల్ హిట్ కావాల్సి వచ్చింది. ఇమేజ్‌ని నిలబెట్టుకునేందుకు ప్రస్తుతం పూరి జగన్నాథ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్‌కి చాలా కీలకంగా మారిన ఈ చిత్రం ఎలా ఉంటుందో చెప్పలేం. ఐతే పూరీ చిత్రం అయితే బ్లాక్ బస్టర్ లేదంటే బోర్లా పడుతుంది.
ఎన్టీఆర్‌కి సూటయ్యే మంచి సబ్జెక్టు తయారుచేయమని భాస్కర్‌కు ఇప్పటికే దిల్ రాజు చెప్పినట్టు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. ఇదిలా ఉంచితే, ఆ మధ్య దిల్ రాజు బ్యానర్లో ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంలో ఎన్టీఆర్ నటించిన సంగతి తెలిసిందే.