బుధవారం వరకు రూ.82 కోట్లు వసూలు చేసిన కత్తి.. ఈ వారం ముగిసేలోపు వందకోట్లు కొల్లగొడుతుందని ట్రేడ్ అనలిస్ట్ త్రినాథ్ తెలిపారు. అదే కనుక నిజమైతే తమిళంలో ఈ ఏడాది భారీ విజయం సాధించిన సినిమా కూడా ఇదే అవుతుంది. తమిళ పరిశ్రమలో ఓ చిత్రం వంద కోట్ల క్లబ్బులో అడుగుపెట్టడమనేది చాలా అరుదు.