టాలెంట్‌తో పాటు గ్లామర్ ఉన్నప్పటికీ మలయాళ కుట్టి క్యాథరీన్‌కు అవకాశాలు కలిసిరాలేదు. 2010లోనే హీరోయిన్గా తెరంగేట్రం చేసినప్పటికీ, కమర్షియల్ సక్సెస్ కాలేకపోతోంది. తెలుగులో 'పైసా', 'ఇద్దరమ్మాయిలతో' లాంటి భారీ చిత్రాల్లో నటించినప్పటికీ, దక్షిణాదిన ఆమె ఆశలు నిరాశగానే మిగిలిపోయాయి.
క్యాథరీన్ తాజాగా, తమిళంలో కార్తీ హీరోగా రూపొందిన 'మద్రాస్' చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం ఇటీవలే తమిళనాట విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం హీరో కార్తీకి మంచి పేరు తీసుకురావడంతో పాటు క్యాథరీన్‌కు తొలి కమర్షియల్ సక్సెస్‌ను అందించింది.