చక్రి మృతితో బోరున విలపించిన ఆర్పీ పట్నాయక్!

సోమవారం, 15 డిశెంబరు 2014 (13:20 IST)
తన సహచర సంగీత దర్శకుడు చక్రి మృతితో మరో సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ బోరున విలపించారు. తన మిత్రుడు చక్రి మరణం తనను ఎంతో వేధిస్తోందన్నారు. సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించిన చక్రి మృతిపై ఆయన స్పందిస్తూ దుఃఖాన్ని ఆపుకోలేక తీవ్ర ఉద్విగ్నతకు గురై గట్టిగా రోదించారు. 
 
అలాగే, చక్రి పార్థీవ దేహానికి ప్రముఖ సీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను భవిష్యత్తులో చక్రితో ఎన్నో సినిమాలు చేయవచ్చని భావించానని, అతను అందరికి కావాల్సిన వాడన్నారు. చక్రి స్వరం బాగుంటుందని, తనకెంతో ఇష్టమని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి