ఇక అసలు విషయానికొస్తే యంగ్ హీరో రామ్ చరణ్ నటించబోయే తదుపరి సినిమా గురుంచి అనేక వార్తలు వస్తున్నాయి. సరికొత్త కథతో ముందుకు రావాలని నిర్ణయించుకున్న ఈ మెగా హీరో చివరికి శ్రీనువైట్లతో ఫిక్స్ అయినట్లు సమాచారం. అంతేకాదు వీరిద్దరి కాంబినేషనల్లో వచ్చే సినిమాకు 'నా పేరు రాజు' అనే టైటిల్ను కూడా ఖరారు చేశారట. ఈ సినిమా మార్చి నెలలో ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హీరోయిన్, ఇతర పాత్రల ఎంపిక పనులు జోరుగా సాగుతున్నట్టు సినీ వర్గాల సమాచారం.