ప్రముఖ సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని, అక్ష పార్థసాని జంటగా నటించిన తమిళ చిత్రం 'సలీమ్'. ఎస్.కె. పిక్చర్స్, శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెలుగులోకి విడుదల చేయనున్న ఈ చిత్రానికి 'డాక్టర్ సలీమ్' అనే టైటిల్ను ఖరారు చేశారు. సురేష్ కొండేటి, తమటం కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
సురేష్ కొండేటి మాట్లాడుతూ... ''ఇదొక మంచి యాక్షన్ థ్రిల్లర్. ఇందులో హీరోగా నటించడంతో పాటు విజయ్ ఆంటోని పాటలు కూడా స్వరపరిచారు. ఐదు పాటలూ సందర్భానుసారంగా సాగుతాయి. విజయ్ ఆంటోని చేసిన ఫైట్స్ థ్రిల్ కి గురి చేస్తాయి. మా సంస్థ నుంచి వచ్చిన గత చిత్రాల విజయానికి ఏమాత్రం తగ్గని రీతితో ఈ చిత్రం ఉంటుంది' అని తెలిపారు.