2013 ఫిలింఫేర్ అవార్డ్స్: బరిలో పవన్, మహేష్, చెర్రీ, ప్రభాస్!

బుధవారం, 2 జులై 2014 (16:00 IST)
2013 సంవత్సరానికి గాను ఐడియా ఫిలింఫేర్ అవార్డులకు వివిధ విభాగాలలో పోటీపడుతూ నామినేషన్లు దక్కించుకున్న చిత్రాల వివరాలను ఫిలింఫేర్ ప్రకటించింది. ఉత్తమ చిత్రాల జాబితాలో పవన్ కల్యాణ్ "అత్తారింటికి దారేదీ", మహేష్ బాబు "సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు", ప్రభాస్ మిర్చి, నితిన్ గుండెజారి గల్లంతయ్యిందే, అదేవిధంగా 'ఉయ్యాల జంపాల" వంటి చిత్రాలు పోటీపడుతున్నాయి.

అలాగే ఉత్తమ నటుడి అవార్డ్ కోసం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, చరణ్, ప్రభాస్, నితిన్ ఇలా ఐదుగురు హీరోలు పోటి పడుతున్నారు. ఈ ఇదుగురిలో మరి ఉత్తమ నటుడు అవార్డ్ ఎవరిని వరిస్తుందో అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

ఇంకా ఉత్తమ నటి విభాగంలో అనుష్క (మిర్చి), నందితారాజ్ (ప్రేమకథాచిత్రం), నిత్యా మీనన్ (గుండె జారి గల్లంతయ్యిందే), రకుల్ ప్రీత్ సింగ్ (వెంకటాద్రి ఎక్స్ప్రెస్), సమంత (అత్తారింటికి దారేది)లు పోటీపుడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి