శింబుతో ప్రేమ ఫట్ అయినా.. తెల్లమ్మాయ్ హన్సికకు తలనొప్పి వదలట్లేదు. 'వాలు' అనే సినిమాలో శింబు, హన్సిక కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రారంభంలో ప్రేమలో పడి, చివరికొచ్చేసరికి బ్రేకప్ అయ్యారు. అయితే, ఆ సినిమా షూటింగ్ మాత్రం పూర్తికాలేదు. అయినప్పటికీ ఆమె ఇటీవల మళ్లీ డేట్స్ ఇచ్చి సహకరించింది. కానీ, ఇంకా పూర్తికాలేదట.
దీనిపై ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. "మొదట్లో 64 రోజులు అడిగారు. అంతేకాకుండా, అదనంగా మరో ఇరవై రోజులిచ్చాను. తర్వాత ఇంకో పాట తీయాలంటే ఈ నెల 7, 8, 9 తేదీల్లో డేట్స్ ఇచ్చాను.