శృతిహాసన్‌కు అమ్మగా.. శంకరాభరణం తులసి!

సోమవారం, 29 సెప్టెంబరు 2014 (16:49 IST)
'శంకరాభరణం' సినిమాతో మంచి గుర్తింపు పొందిన తులసి అందరికీ గుర్తుండే ఉంటుంది. వందలాది సినిమాల్లో రకరకాల పాత్రలు పోషించిన తులసి ఇరవై ఏళ్ల క్రితం కన్నడ దర్శక నిర్మాత శివమణిని పెళ్లి చేసుకుని వెండితెరకు దూరమైంది.
 
సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ తెరముందుకు రానుంది. తెలుగులో కూడా పలు సినిమాలలో నటించనుంది. అందులో భాగంగా మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో ఆమె తల్లి పాత్రలో నటిస్తోంది.
 
"ఇందులో శృతి హాసన్‌కి అమ్మగా నటిస్తున్నాను. అలాగే తమిళంలో కూడా తల్లి పాత్రలు చేస్తున్నాను. మరో విషయం ఏమిటంటే, స్టయిలిష్ అమ్మగా నటించాలనుంది" అని తులసి స్వయంగా వెల్లడించింది. తద్వారా తులసీ రీ ఎంట్రీ ఖాయమని తెలిసిపోయింది. 

వెబ్దునియా పై చదవండి