జబర్దస్త్ స్కిట్ వల్లే హాస్యనటుడు వేణుపై దాడికి కారణం!

ఆదివారం, 21 డిశెంబరు 2014 (12:55 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హాస్య నటుడు వేణుపై దాడికి ఈటీవీ ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంలో ఆయన ఎంచుకున్న స్కిట్ కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ ప్రోగ్రాం జబర్దస్త్‌తో వేణుకు మంచి పాపులారిటీ వచ్చిన విషయం తెల్సిందే. ఇతనిపై శనివారం రాత్రి హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో జరిగింది. ఈ దాడిలో గాయపడిన వేణును అతడి స్నేహితులు అపోలో ఆస్పత్రిలో చేర్చారు. 
 
జబర్దస్త్‌లో భాగంగా ఈ నెల 18న రాత్రి 9.30 గంటలకు ప్రసారమైన ఓ స్కిట్ నేపథ్యంలోనే వేణుపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. జబర్దస్త్ కార్యక్రమంలో ప్రసారమైన సదరు స్కిట్లో వేణు, గౌడ సామాజిక వర్గానికి చెందిన మహిళల జీవన విధానాన్ని కించపరిచేలా వ్యవహరించారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయనపై దాడి జరిగిందన్న వాదన వినిపిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి