టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ మూడు భాషల్లో క్రేజీ తారగా వెలుగుతున్న బ్యూటీ శ్రుతి హాసన్. ఈ లేతపరువాల భామతో లిప్ లాక్ ముద్దు చేయమంటే ఎవరైనా తిరస్కరిస్తారా?. అయితే బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం మాత్రం నిర్మొహమాటంగా వద్దనేశాడు.
అయితే, శ్రుతితో ఇలా ముద్దు సీను చేయననడానికి కారణం ఏమిటని ఆరా తీస్తే, జాన్ అబ్రహాం ఇటీవలే అమెరికాకు చెందిన ఇన్వెస్టిమెంట్ బ్యాంకర్ ప్రియా రంచల్ ని పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలోనే భార్యామణి ఇకపై సినిమాల్లో లిప్ లాక్ సీన్లు చేయకూడదంటూ కండిషన్ పెట్టిందట. ఆవిడ గారి రూల్సుని ఈయనగారు ఇప్పుడు కచ్చితంగా పాటిస్తున్నాడన్న మాట!