ఇక అసలు విషయానికి వస్తే.. ఆ మధ్య కోలీవుడ్‌లో క్రేజీ బ్యూటీగా వెలిగిన బ్యూటీ జ్యోతిక. అమ్మడు ఆ తర్వాత హీరో సూర్యను వివాహం చేసుకుని ఫ్యామిలీకే పరిమితమైనంది. ఇటీవల మళ్లీ సినిమాలపై దృష్టి సారిస్తున్న జ్యోతిక వయసు ఇప్పుడు 36 ఏళ్లు. అందుకు తగినట్టుగా ఆమె నటిస్తున్న తాజా చిత్రానికి '36 వయదినిలే' (36 ఏళ్ల వయస్సులో) అనే టైటిల్‌ను నిర్ణయించారు.
చాలా కాలం గ్యాప్ తర్వాత జ్యోతిక ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు విదితమే. మలయాళంలో హిట్టయిన 'హౌ ఓల్డ్ ఆర్యూ' అనే చిత్రం తమిళ రీమేక్ లో జ్యోతిక నటిస్తోంది. ఈ సినిమాకి ఏం టైటిల్ పెడదామా? అని చర్చ జరుగుతున్న సమయంలో ఈ '36 వయదినిలే' (36 ఏళ్ల వయసులో) అనే పేరును జ్యోతిక సూచించిందట. అందరూ చాలా బాగుందని అనడంతో దానినే ఖరారు చేస్తున్నారు. దీంతో సినిమాలకు పేర్లు పెట్టడంలో కోలీవుడ్‌కు కోలీవుడ్డే సాటి అని మరో సారి నిరూపించుకుంది.