కమల్ హాసన్ కొత్త సినిమా టైటిల్ వామ మార్గ..!

సోమవారం, 22 డిశెంబరు 2014 (18:27 IST)
కమల్ హాసన్ కొత్త సినిమాకు రెడీ అయ్యారు. ఈ సినిమాకు వామ మార్గ అనే టైటిల్ ఖరారు చేసుకున్నారు. 'విశ్వరూపం 2', 'ఉత్తమ విలన్', 'పాపనాశం' చిత్రాలతో బిజీగా వున్న విలక్షణ నటుడు కమలహాసన్ తన తదుపరి చిత్రానికి అప్పుడే టైటిల్ ఎంచుకున్నాడు. 
 
ఈ పేరును బట్టి చూస్తే ఇది వామపక్ష భావజాలం (కమ్యూనిజం) నేపథ్యంలో సాగుతుందన్న కథనాలు వస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం కమల్ ఇంతవరకు వెల్లడించలేదు. ఇందులో కథానాయకుడుగా నటిస్తూ, కమల్ దీనికి దర్శకత్వం వహిస్తాడనీ, ఇది భారీ చిత్రం అవుతుందనీ కోలీవుడ్ టాక్.

వెబ్దునియా పై చదవండి