లఘుచిత్రంలో కృష్ణంరాజు: అల్లు అర్జున్, సిద్ధార్థ్ తర్వాత ఈయనే!

శనివారం, 22 నవంబరు 2014 (15:09 IST)
లఘుచిత్రంలో ప్రముఖ నటుడు కృష్ణంరాజు నటించబోతున్నారు. ఇటీవలే హీరో అల్లు అర్జున్ అలా 'అయామ్ దట్ చేంజ్' అనే షార్ట్ ఫిలింలో నటించాడు. అల్లు అర్జున్ తర్వాత నటుడు సిద్ధార్థ కూడా షార్ట్ ఫిలిమ్ చేశాడు. తాజాగా కృష్ణంరాజు కూడా అటువంటి బాధ్యతను తీసుకోవడానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నారు. 
 
ప్రముఖ గాయకుడు, గిన్నిస్ రికార్డు విజేత గజల్ శ్రీనివాస్ 'క్లీన్ గంగ' పేరిట ఓ లఘు చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కీలకపాత్ర పోషించమని కృష్ణంరాజును ఆయన కోరినట్టు, అందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి