ఈ స్థితిలో ఆయన సరసన హీరోయిన్గా క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఆ రెండో హీరోయిన్ ఎవరనే విషయంపై సస్పెన్స్ చోటు చేసుకుంది. తాజాగా రామ్ చరణ్ చిత్రంలో నటించే మరో నటి కృతి కర్బంద అని తెలిసింది. అందులో అమ్మడు హీరోయిన్ పాత్రలో నటించడం లేదట. చరణ్ సిస్టర్‌గా నటిస్తున్నట్టు సమాచారం.
ఈ సినిమాలో చరణ్ సిస్టర్ పాత్రకు ప్రాముఖ్య ఉంటుందని, అందువలనే ఆమె సిస్టర్‌గా నటించేందుకు అంగీకరించినట్టు తెలిపిందని సమాచారం. మార్చి 5న ఈ చిత్రం షూటింగును హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభిస్తారు. తర్వాత రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని సినీ వర్గాల సమాచారం.