డర్టీ పాలిటిక్స్ సినిమాకు సంబంధించి తలెత్తిన వివాదాలకు సెక్సీ క్వీన్ మల్లికా షెరావత్ ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తోంది. కానీ హాట్ భామకు కష్టాలు తప్పేలా లేవు. ఈ మేరకు మల్లికా షెరావత్పై కేసు నమోదైంది. డర్టీ పాలిటిక్స్’ సినిమా కోసం తాను తన ఒంటిమీద కప్పుకున్నది జాతీయ పతాకం కాదని మల్లికా షెరావత్ చెబుతోంది. మూడు రంగులున్నంత మాత్రాన దానిని జాతీయ పతాకం అనడమేంటని మల్లిక అడిగింది.
డర్టీ పాలిటిక్స్ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లో మల్లికా షెరావత్ రాజస్థాన్ అసెంబ్లీకి ఎదురుగా... ఓ కారు టాప్ పైన అర్థనగ్నంగా కూర్చుని... తన శరీరం పై కేవలం జాతీయ పతాకాన్ని మాత్రమే కప్పుకుంది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో మల్లిక జాతీయపతాకాన్ని చీరలా అభ్యంతరకరంగా ధరించినట్లు ఈ సినిమా ఫస్ట్ లుక్ ద్వారా తెలుస్తుందని హైదరాబాద్కు చెందిన సామాజిక కార్యకర్త ధన్ పాల్ రావు పేర్కొన్నారు.