ఈ నెల 30న ఈ కార్యక్రమాలు నాన్ స్టాప్‌గా జరుగుతాయి. పలువురు తారలు, దర్శకులు, నిర్మాతలు పాల్గొనే ఈ వేడుకలో పలు డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్, స్కిట్స్, క్రికెట్, తంబోలా వంటి అంశాలు చోటు చేసుకుంటున్నాయి.
అలాగే, మంచు వారి ఫ్యామిలీ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీరంతా కలసి కబడ్డీ ఆటను ప్లాన్ చేస్తున్నారట. వీరితో బాటుగా పలువురు హీరోలు, హీరోయిన్లు ఈ కబడ్డీ ఆటలో పాల్గొంటారు.