మోహన్ బాబు ద్వితీయ పుత్రుడు మంచు మనోజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. విరానికా మిత్రురాలైన ప్రణతి రెడ్డిని మనోజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. మార్చి 4, ఉదయం 10.30 గంటలకు వీరి ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్ అయింది. అట్టహాసంగా ఈ వేడుక జరుగబోతోంది.
మార్చి 4న మనోజ్, ప్రణతిల నిశ్చితార్థం జరగబోతోంది. ఇన్ని రోజులు ప్రణతి పేరు వినడమే కాని, ఆమె ఫొటోను మాత్రం చూడలేకపోయాం. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ ఆమె ఫొటోను ట్విట్టర్లో పెట్టారు. ఈ సందర్భంగా, ఈమే నా దేవత అంటూ మనోజ్ ట్వీట్ చేశాడు. ఈమె పేరు ప్రణతి... నా చిన్న కుమారుడికి కాబోయే భార్య... ఇకపై తన మూడో కూతురు అంటూ మోహన్ బాబు స్పందించారు.