చిత్ర దర్శకుడు ముప్పరాజు హనుమాన్ మాట్లాడుతూ... ‘ఒక మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాను. మంచు విష్ణు ఈ కథను సింగిల్ సిట్టింగ్లో ఓకె చేశారు. ఆయన ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారు. నేటి సమాజంలోని ఒక తీవ్రమైన సమస్యకు ఈ చిత్రంలో సమాధానం చెప్పనున్నాం. భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు సంబంధించి ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలో తెలియజేస్తామని అన్నారు.