నాకంటే ముందు పుట్టి ఉంటే నాగబాబు మెగాస్టార్... మరి పవన్...?

మంగళవారం, 21 అక్టోబరు 2014 (14:32 IST)
టాలీవుడ్ మెగాస్టార్ మొదటి తమ్ముడు నాగబాబును ఆకాశానికెత్తేశారు. తన మెగా బ్రదర్ నాగబాబు తనకన్నా ముందు పుట్టి చిత్ర రంగానికి వచ్చి ఉంటే అతడే మెగాస్టార్ అయిపోయి ఉండేవాడంటూ పొగడ్తల జల్లు కురిపించారు. వివరాలలోకి వెళితే మాటివిలో ‘సీతామహాలక్ష్మి’ అనే సీరియల్ లో నాగబాబు నెగిటివ్ క్యారెక్టర్ చేస్తూ విమర్శకుల మన్ననలను పొందుతున్నారు. 
 
ఈ మాటే చిరంజీవి చెపుతూ... ఆ సీరియల్ లో నాగబాబును చూస్తే... ఓరి వెధవ అని అన్నతర్వాత నా తమ్ముడు అని మిన్నకుంటానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సీరియల్ తీస్తున్న యూనిట్‌ను అభినందిస్తూ చిరంజీవి పైవిధంగా స్పందించారు. 
 
కాగా నాగబాబుపై చిరంజీవి చేసిన కామెంట్లపై టాలీవుడ్ సినీజనం రకరకాలుగా స్పందిస్తున్నారు. నాగబాబును మరీ ఆ విధంగా పొగడ్తల జల్లు కురిపిస్తున్న చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి కూడా అలానే మాట్లాడుతారా...? అంటూ చర్చించుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి