మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు టైటిల్ కూడా ఖరారు చేసినట్లు సమాచారం. 'భలే భలే మగాడివోయ్' అనే టైటిల్‌ను పెట్టాలని సినిమా యూనిట్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని క్యారిక్టెర్ను సరికొత్తగా రూపొందిస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. శ్రీదివ్య కథానాయికగా నటించనుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుగనుంది.