కథను చూస్తా... హీరోను కాదు... నయనతార, అందుకే శింబుతోనా...

మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (18:13 IST)
నటిగా సీనియర్‌ అయితే.. తన పక్క ఎవరు నటిస్తున్నారు. వారి ఇమేజ్‌ ఏమిటి అనేది ఆలోచిస్తారు. కానీ నటి నయనతార మటుకు అలాంటిదేవీ ఆలోచించడంలేదు. ముందుగా కథ నచ్చాలి. అందులో భావోద్వేగాలు బాగా నచ్చాలి అంటూ చెబుతుంది. 
 
కెరీర్‌ మొదట్లో ఇవేవీ చూసుకోకపోయినా.. ప్రస్తుతం మాత్రం ఇలాంటివి చూసుకుంటానని అంటోంది.  నేను కథ విన్నప్పుడు ప్రేక్షకుడిలా వింటాను. అలా వింటేనే అది రక్తికడుతుంది. ఇలా నేను ఒక రూల్‌ పెట్టుకుని అలా నడుచుకుంటున్నాను అంటూ సెలవిచ్చింది.

వెబ్దునియా పై చదవండి