మెగాస్టార్ ఇంట్లో త్వరలో పెద్ద పండుగ జరగనుంది. అదేంటి? అనుకుంటున్నారా? అదేనండి.. చిరంజీవి దంపతులకు షష్ఠి పూర్తి. ఈ వేడుక త్వరలో వైభవంగా జరుగనుంది. ఎప్పుడూ యంగ్‌గా కనిపించే మెగాస్టార్ చిరంజీవికి అప్పుడే 60 ఏళ్లు పూర్తికానున్నాయి. యస్.. కోణిదెల్ల శివ శంకర వర ప్రసాద్ అలియాస్ చిరంజీవి 22 ఆగస్టు 1955వ సంవత్సరంలో జన్మించారు. ఈ ఆగస్టు 22 నాటికి చిరంజీవి 60 ఏళ్లను పూర్తి చేసుకోబోతున్నారు.
మొగల్తూరులో చిరంజీవి బంధువులు, శ్రేయోభిలాషులు షష్ఠి పూర్తికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి చిరంజీవి తన 150వ సినిమా కోసం మల్లగుల్లాలు పడుతున్నారు. 60వ పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి తన 150వ సినిమా వివరాలను ప్రకటించే అవకాశం ఉందని, ఇప్పటికే కథలు వింటున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.