'బొమ్మరిల్లు' భాస్కర్‌కు హీరోయిన్ చిక్కింది.. నిత్యామీనన్‌తో బెంగళూర్ డేస్!

శుక్రవారం, 19 డిశెంబరు 2014 (10:56 IST)
బొమ్మరిల్లు భాస్కర్‌కు హీరోయిన్ దొరికింది. హాసినికి పెళ్లైపోవడంతో కొత్త సినిమా కోసం వేచి చూస్తున్న భాస్కర్
నిత్యామీనన్‌తో కొత్త సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. మలయాళంలో హిట్టయిన 'బెంగళూర్ డేస్' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో దిల్ రాజు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఇందులో నిత్యా ఓ కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం. ఈ విషయమై ఇటీవల దర్శకుడు ఈ ముద్దుగుమ్మను కలసి చర్చించినట్టు, ఆమె తన అంగీకారం తెలిపినట్టు సమాచారం. ఆర్యాకు జంటగా ఆమె నటిస్తుంది.
 
విశేషం ఏమిటంటే, ఈ సినిమా మలయాళం ఒరిజినల్‌లో నిత్యా గెస్ట్ పాత్ర చేసింది. ఇదిలా ఉంచితే, సిద్ధార్థ్, సమంతా మరో జంటగా నటిస్తారనీ, మూడో జంట ఎంపిక జరుగుతోందనీ అంటున్నారు. జనవరిలో ఈ సినిమా సెట్స్‌కి వెళుతుంది.

వెబ్దునియా పై చదవండి