పవన్ ఫోటోకి నితిన్ ముద్దు... ఊగిపోయిన పవన్ ఫ్యాన్స్

శుక్రవారం, 28 నవంబరు 2014 (19:09 IST)
నితిన్ పవన్ కళ్యాణ్ పై తనకున్నటువంటి అభిమానాన్ని ఇంకోసారి చూపించాడు. 'చిన్నదాన నీ కోసం' చిత్రం ఆడియో సందర్భంగా ఓ అభిమాని పవన్ కళ్యాణ్, నితిన్ చిత్రపటాన్ని ఆయనకు బహూకరించగా నితిన్, పవన్ కళ్యాణ్ చిత్రాన్ని ముద్దాడి తన అభిమానాన్ని సభాముఖంగా చాటేశాడు. పవన్ ఫోటో ఎక్కడ పెట్టుకుంటారని అడిగితే... ఆయన తన గుండెల్లో ఉన్నారంటూ నితిన్ జవాబివ్వడంతో పవన్ ఫ్యాన్స్ ఊగిపోయారు.
 
పవన్ కళ్యాణ్ అభిమానులను కుర్రహీరో నితిన్ మెల్లిగా సొంతం చేసుకున్నట్లే కనబడుతోంది. నితిన్ నటించిన 'చిన్నదానా నీకోసం' చిత్రం ఆడియో వేడుకలో ఈ విషయం స్పష్టంగా కనబడింది. నిన్న రాత్రి శిల్పకళా వేదిక ప్రాంగణంలో జరిగిన చిన్నదానా నీకోసం ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ పేరుతో మారుమోగిపోయింది. 
 
ఈ ఆడియో కార్యక్రమానికి అతిథిగా వచ్చిన నాగార్జున సైతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుద్దేశించి మాట్లాడుతూ.. 'పవన్ కళ్యాణ్ అభిమానులకు బాగున్నారా’ అని అనడంతో ఆడిటోరియం పవన్ నామస్మరణతో దద్దరిల్లి పోయింది. 
 
అంతేకాదు... నితిన్ మాట్లాడేటపుడు కూడా పవన్ కళ్యాణ్ గురించి ఫ్యాన్స్ కేకలు వేశారు. ఇక అలీ మాట్లాడేటపుడు కూడా పవన్ నామస్మరణే. నాగార్జున మాట్లాడేటపుడు మాత్రం పవన్ నామజపంతోపాటు అఖిల్ అరంగేట్రం గురించి కూడా ఫ్యాన్స్ కేకలు వేశారు. మొత్తానికి పవన్ మేనియా అలా సాగిపోతోంది.

వెబ్దునియా పై చదవండి