'కందిరీగ' ఫేం సంతోష్ శ్రీనివాస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'రభస'. సంతోష్ శ్రీనివాస్ రెండో సినిమాకే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకి తీసుకు రానున్నట్లు చెపుతున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ‘రాకాసి రాక్షసి..’ అనే పాటను చాలా ఎనర్జిటిక్‌గా పాడాడు. ఇది అభిమానులకు విందుగా ఉంటుంది.