బికినీకి రెడీ... 'పటాస్' బ్యూటీ వెల్లడి!

మంగళవారం, 27 జనవరి 2015 (11:09 IST)
బికినీ ధరించి అందాలను ఆరబోసేందుకు తాను రెడీగా ఉన్నానని పంజాబీ బ్యూటీ శ్రుతి సోధీ వెల్లడించింది. ఇటీవల విడుదలైన 'పటాస్' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు ఇప్పటి వరకు తన మాతృభాషలో మూడు చిత్రాల్లో మాత్రమే నటించింది. 
 
ప్రస్తుతం 'పటాస్' విజయం సాధించడంతో ఈ అమ్మడు టాలీవుడ్‌లో పాగా వేసేందుకు సిద్ధమైంది. అన్ని రకాల పాత్రలు చేస్తానని తెలుపుతూనే.. పాత్ర అవసరాన్ని బట్టి బికినీలు ధరించేందుకు కూడా తాను రెడీ అంటూ, సెక్సీ సన్నివేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టాలీవుడ్‌లో స్థిరపడేందుకు అన్నిటికీ రెడీ అయిన అమ్మడుకు అవకాశాలు వస్తాయో? లేదో వేచి చూడాలి.
 

వెబ్దునియా పై చదవండి