పవన్ కు వెన్నునొప్పి... సంతకం చేశారు ఫర్వాలేదు... రేణూ దేశాయ్

మంగళవారం, 22 జులై 2014 (13:08 IST)
పవన్ కళ్యాణ్ ను రేణూ దేశాయ్ ఆహ్వానించింది. 'ఇష్క్ వాలా లవ్' సినిమా మరాఠీలో మంచి విజయం సాధించడంతో దానిని తెలుగులో డబ్ చేస్తోంది రేణూ. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించిందట రేణూ. ఐతే ఇవాల్టి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ వస్తాడేమోనని అందరూ అనుకున్నారు. కానీ రావడం లేదని రేణూ దేశాయ్ ఫేస్ బుక్ ద్వారా తెలియజేసింది. 
 
రేణూ తన ఫేస్ బుక్ పవన్ రాలేకపోవడంపై... 'పవన్‌ కల్యాణ్‌ తన గోపాల గోపాల చిత్రీకరణలో బిజీగా ఉండటంతో కాస్త వెన్నునొప్పితో బాధపడుతున్నారు. అందువల్ల రాలేకపోతున్నారు. ఐతే తన చిత్రం విజయవంతం కావాలని ఆయన సీడీపై సంతకం చేశారని రేణు పోస్ట్ చేసింది. దీంతో మరోసారి రేణూ దేశాయ్ - పవన్ కళ్యాణ్ వ్యవహారం చర్చలోకి వచ్చింది.

వెబ్దునియా పై చదవండి